Jeremiah 39:3 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సవ్గుర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతి యగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతు లందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెరూషలేము పట్టబడగా అధిపతులందరు, నేర్గల్‌షరేజరు సమ్గర్నెబో షండుల కధిపతియగు శర్సెకీము, జ్ఞానులకధిపతియగు నేర్గల్‌షరేజరు మొదలైన బబులోనురాజు అధిపతులందరు లోపలికి వచ్చి మధ్యగుమ్మములో కూర్చుండిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు బబులోను రాజు అధికారులు శమ్గరుకు చెందిన నెర్గల్-షారెజెరు, ముఖ్య అధికారియైన నెబో-శర్సెకీము, వచ్చి మధ్య ద్వారంలో కూర్చున్నారు. నెర్గల్-షారెజెరు ఒక ఉన్నతాధికారి, మిగిలినవారు బబులోను రాజు ఇతర అధికారులు.