Jeremiah 4:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
రౌతులును విలు కాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలొ నివాసులెవరును లేరు,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
గుర్రపు రౌతుల రవాళింపులు, విలుకాండ్ర శబ్దాలను యూదా ప్రజలు విని పారిపోతారు! కొందరు గుహలలో దాగుకొంటారు. కొంత మంది పొదలలో తలదాచుకుంటారు. మరి కొందరు కొండల మీదికి ఎక్కుతారు. యూదా నగరాలన్నీ నిర్మానుష్యమవుతాయి. అక్కడ ఎవ్వరూ నివసించరు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రౌతులును విలు కాండ్రునుచేయు ధ్వని విని పట్టణస్థులందరు పారిపోవు చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు, ప్రతి పట్టణము నిర్జనమాయెను వాటిలో నివాసులెవరును లేరు,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
గుర్రాలు, విలుకాడుల శబ్దానికి ప్రతి ఊరు ఎగిరిపోతుంది. కొందరు పొదల్లోకి వెళ్తారు; కొందరు రాళ్ల మధ్య ఎక్కుతారు. పట్టణాలన్ని నిర్జనమైపోయాయి; వాటిలో ఎవరూ నివసించరు.