Jeremiah 4:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్చిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు విన బడుచున్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ప్రసవ వేదనలో స్త్రీ అరచినట్లుగా నేనొక రోదన విన్నాను. అది ప్రథమ కన్పులో స్త్రీ పడిన వేదనవంటిది. అది సీయోను కుమార్తె రోదన. ఆమె చేతులెత్తి ప్రార్థిస్తూ, “అయ్యో, నేను మూర్ఛపోతున్నాను! హంతకులు నన్ను చుట్టుముట్టారు!” అని అంటున్నది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రసవవేదనపడు స్త్రీ కేకలువేయునట్లు, తొలికానుపు కనుచు వేదనపడు స్త్రీ కేకలువేయునట్లు సీయోనుకుమార్తె–అయ్యో, నాకు శ్రమ, నరహంతకులపాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని యెగరోజుచు చేతులార్చుచు కేకలువేయుట నాకు వినబడుచున్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రసవ వేదనలో ఉన్న స్త్రీ ఏడ్పు, తన మొదటి బిడ్డను కంటూ వేదనపడుతున్న స్త్రీ కేకలు, ఊపిరి కోసం అల్లాడుతూ, సీయోను కుమారి తన చేతులు చాచి, “అయ్యో! నేను మూర్ఛపోతున్నాను; నా ప్రాణం హంతకులకు అప్పగించబడింది,” అంటూ కేకలు వేయడం నాకు వినబడుతుంది.