Jeremiah 42:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు బబులోనురాజునకు భయపడు చున్నారే; అతనికి భయపడకుడి, అతని చేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి,
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బబులోను రాజు విషయంలో ఇప్పుడు మీరు భయపడుతున్నారు. కాని అతనిని చూచి మీరు భయపడవద్దు. బబులోను రాజంటే మీరు భయపడవద్దు.’ ఇదే యెహోవా సందేశం. ‘ఎందువల్ల నంటే, నేను మీతో ఉన్నాను. నేను మిమ్మల్ని కాపాడతాను. నేను మిమ్మల్ని రక్షిస్తాను. అతడు మీ మీద చెయ్యి వేయలేడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు బబులోనురాజునకు భయపడుచున్నారే; అతనికి భయపడకుడి, అతనిచేతిలోనుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను మీకు తోడై యున్నాను, అతనికి భయపడకుడి,౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఇప్పుడు మీరు ఎవరికైతే భయపడుతున్నారో ఆ బబులోను రాజుకు మీరు భయపడవద్దు. అతనికి భయపడవద్దు, అని యెహోవా ప్రకటిస్తున్నారు, ఎందుకంటే నేను మీతో ఉన్నాను, మిమ్మల్ని రక్షిస్తాను అతని చేతుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను.