Jeremiah 44:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారి పోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదాలో బతికి బయటపడి ఈజిప్టులో నివసిస్తున్న కొద్ది మందిలో ఏ ఒక్కడూ నా శిక్షను తప్పించుకోలేడు. యూదాకు తిరిగి రావటానికి ఒక్కడు కూడా మిగలడు. వారు యూదాకు తిరిగివచ్చి మరల అక్కడ నివసించాలని కోరుకుంటారు. బహుశః తప్పించుకున్న బహు కొద్దిమంది తప్ప, వారిలో ఒక్కడు కూడ యెరూషలేముకు తిరిగి వెళ్లడు.’”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువచేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్లు యూదా వారిలోని శేషము ఎవరును తప్పించుకొనరు, శేషమేమియు ఉండదు, పారిపోవువారు గాక మరి ఎవరును తిరిగిరారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఈజిప్టులో నివసించడానికి వెళ్లిన యూదా వారిలో మిగిలి ఉన్న వారెవరూ తప్పించుకోలేరు, ఎక్కడికైతే తిరిగివెళ్లి జీవించాలని అనుకుంటున్నారో, ఆ యూదా దేశానికి ప్రాణాలతో తిరిగి వెళ్లరు; పారిపోయిన కొంతమంది తప్ప ఎవరూ తిరిగి వెళ్లరు.”