Jeremiah 45:4 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడునేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించు చున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యిర్మీయా, నీవిది బారూకుకు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: నేను నిర్మించిన దానిని నేనే పడగొట్టుతున్నాను. నేను దేనినైతే నాటితినో దానిని నేనే పెరికివేస్తున్నాను. యూదాలో ప్రతిచోటా నేనలా చేస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నీవు అతనికి ఈ మాట తెలియజేయుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు — నేను కట్టినదానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటినదానినే పెల్లగించుచున్నాను; సర్వభూమినిగూర్చియు ఈ మాట చెప్పు చున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అయితే యెహోవా నీతో, ‘యెహోవా ఇలా చెప్తున్నారు: నేను కట్టిన దాన్ని నేనే కూలదోస్తాను, నేను నాటిన వాటిని నేనే పెరికివేస్తాను; ఇది భూమి అంతటా జరుగుతుంది’ అని చెప్పమని నాకు చెప్పారు.