Jeremiah 46:26 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
వారి ప్రాణము తీయజూచు బబులోనురాజైన నెబు కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అది మునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారి శత్రువుల చేతుల్లో వారంతా ఓడిపోయేలా నేను చేస్తాను. ఆ శత్రువులు వారిని చంపగోరుతున్నారు. నేనా ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరుకు, అతని సేవకులకు అప్పగిస్తాను. “చాల కాలం ముందట ఈజిప్టు శాంతియుతంగా వుండేది. ఈ కష్ట కాలాలు అయిన తర్వాత ఈజిప్టు మరలా శాంతంగా వుంటుంది.” ఈ విషయాలను యెహోవా చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వారి ప్రాణము తీయజూచు బబులోను రాజైన నెబు కద్రెజరుచేతికిని అతని సేవకులచేతికిని వారిని అప్పగించుచున్నాను ఆ తరువాత అదిమునుపటివలెనే నివాసస్థలమగును ఇదే యెహోవా వాక్కు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారిని చంపాలనుకున్న వారి చేతులకు అనగా బబులోను రాజైన నెబుకద్నెజరుకు అతని అధికారులకు నేను వారిని అప్పగిస్తాను. ఆ తర్వాత ఈజిప్టు గతంలో ఉన్నట్లే నివాసయోగ్యంగా ఉంటుంది” అని యెహోవా ప్రకటిస్తున్నారు.