Jeremiah 46:5 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
నాకేమి కనబడుచున్నది? వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నేనేమిటి చూస్తున్నాను? ఆ సైన్యం భయపడింది! సైనికులు పారిపోతున్నారు. ధైర్యవంతులైన వారి సైనికులు ఓడింపబడ్డారు. వారు తత్తరపడి పారిపోతున్నారు. వారు వెనుదిరిగి చూడకుండా పోతున్నారు. ఎటు చూచినా భయం.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకేమి కనబడుచున్నది?వారు ఓడిపోవుచున్నారు వెనుకతీయుచున్నారు వారి బలాఢ్యులు అపజయము నొందుచున్నారు తిరిగిచూడక వేగిరముగా పారిపోవుచున్నారు ఎటుచూచిన భయమే; యెహోవా మాట యిదే.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నేను చూస్తున్నదేంటి? వారు భయభ్రాంతులకు గురవుతున్నారు, వారు వెన్ను చూపుతున్నారు, వారి యోధులు ఓడిపోయారు. వారు వెనుకకు చూడకుండ వేగంగా పారిపోతున్నారు, అన్నివైపులా భయమే” అని యెహోవా ప్రకటిస్తున్నారు.