Jeremiah 47:2 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లు గాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించు వారిమీదను ప్రవహించును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా ఇలా చెపుతున్నాడు, “చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు. శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు. దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు. వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —జలములు ఉత్తరదిక్కునుండి పొర్లి వరదలై మనుష్యులు మొఱ్ఱపెట్టునట్లుగాను దేశనివాసులందరు అంగలార్చునట్లుగాను, దేశముమీదను అందున్న సమస్తముమీదను పట్టణము మీదను దానిలో నివసించువారిమీదను ప్రవహించును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా ఇలా చెప్తున్నారు: “ఉత్తరాన జలప్రవాహాలు ఎలా ఎగసిపడుతున్నాయో చూడండి; అవి వరదలా పొంగి పొర్లిపారుతాయి. అవి దేశం మీద, అందులో ఉన్న వాటన్నిటి మీద, పట్టణాల మీద, వాటిలో నివసించేవారి మీద పొర్లిపారుతాయి. కాబట్టి ప్రజలంతా మొరపెడతారు; దేశంలో నివసించేవారంతా ఏడుస్తారు.