Jeremiah 48:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నదిఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ వర్తమానం మోయాబు దేశాన్ని గురించినది. ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు, “నెబో పర్వతానికి చేటు కలుగుతుంది. నెబో పర్వతం నాశనమవుతుంది. కిర్యతాయిము పట్టణం అణగ దొక్కబడుతుంది. అది పట్టుబడుతుంది. బలమైన దుర్గం అణగ దొక్కబడుతుంది. అది పడగొట్టబడి చిందర వందర చేయబడుతుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోయాబునుగూర్చినది. ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడు. –నెబోకు శ్రమ, అది పాడైపోవుచున్నది. కిర్యతాయిము పట్టబడినదై అవమానము నొందుచున్నది ఎత్తయిన కోట పడగొట్టబడినదై అవమానము నొందుచున్నది ఇకను మోయాబునకు ప్రసిద్ధియుండదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోయాబు గురించి: ఇశ్రాయేలు దేవుడు, సైన్యాల యెహోవా ఇలా చెప్తున్నారు: “నెబోకు శ్రమ, అది శిథిలమైపోతుంది. కిర్యతాయిము ఆక్రమించబడి అవమానించబడుతుంది; దాని కోట పడగొట్టబడి అవమానించబడుతుంది.