Jeremiah 48:18 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు.నీ గొప్పతనము విడిచి దిగిరమ్ముఎండినదేశములో కూర్చుండుము.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“దీబోను వాసులారా గొప్పవైన మీ స్థానాలనుండి దిగిరండి. నేలమీద మట్టిలో కూర్చోండి. ఎందువల్లనంటే, మోయాబును నాశనం చేసిన శత్రువు వస్తున్నాడు. అతడు మీ బలమైన నగరాలను నాశనం చేస్తాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేబోనులో ఆసీనురాలై యుండుదానా, మోయాబును పాడుచేసినవాడు నీ మీదికి వచ్చు చున్నాడు. నీ కోటలను నశింపజేయుచున్నాడు. నీ గొప్పతనము విడిచి దిగిరమ్ము ఎండినదేశములో కూర్చుండుము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“దీబోను కుమార్తెలారా, మీ కీర్తి నుండి క్రిందికి దిగి, ఎండిపోయిన నేల మీద కూర్చుండి, ఎందుకంటే మోయాబును నాశనం చేసేవాడు మీ మీదికి వస్తాడు మీ కోట పట్టణాలను పతనం చేస్తాడు.