Jeremiah 48:33 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమును లేకుండ చేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మోయాబులో గల విశాలమైన ద్రాక్ష తోటలనుండి సుఖసంతోషాలు మాయమైనాయి. గానుగల నుండి ద్రాక్షరసం కారకుండా ఆపాను. రసం తీయటానికి ద్రాక్షకాయలను తొక్కే వారిలో ఆ పాటలు ఆగిపోయాయి వారి అలరింతలు అంతమయ్యాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఫలభరితమైన పొలములోనుండియు మోయాబు దేశములోనుండియు ఆనందమును సంతోషమును తొలగిపోయెను ద్రాక్షగానుగలలో ద్రాక్షారసమునులేకుండచేయు చున్నాను జనులు సంతోషించుచు త్రొక్కరు సంతోషము నిస్సంతోషమాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోయాబు పండ్ల తోటల్లో నుండి, పొలాల్లో నుండి ఆనందం, సంతోషం పోయాయి. నేను వారి గానుగల నుండి ద్రాక్షరసం రాకుండ చేశాను; ఆనందంతో కేకలువేస్తూ వాటిని ఎవరూ త్రొక్కరు. కేకలు వినిపించినప్పటికీ, అవి ఆనందంతో వేసిన కేకలు కావు.