Jeremiah 48:34 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నిమీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“హెష్బోను మరియు ఎలాలే పట్టణవాసులు కేకలు పెడుతున్నారు. వారి రోదన దూరానగల యాహసు పట్టణం వరకు వినిపిస్తూ ఉంది. వారి కేక సోయారు నుండి దూరానగల హొరొనయీము, ఎగ్లాత్షాలిషా వరకు వినవచ్చింది. నిమ్రీములో నీరు సహితం ఇంకిపోయింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నిమ్రీములో నీళ్లు సహితము ఎండిపోయెను హెష్బోను మొదలుకొని ఏలాలేవరకును యాహసు వరకును సోయరు మొదలుకొని హొరొనయీమువరకును ఎగ్లాత్షాలిషావరకును జనులు కేకలువేయుచున్నారు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నిమ్రీములోని నీళ్లు కూడా ఎండిపోయాయి కాబట్టి హెష్బోను నుండి ఎల్యాలెహు యాహాజుల వరకు, సోయరు నుండి హొరొనయీము, ఎగ్లత్-షెలీషియాల వరకు, వారి కేకలు వినిపిస్తున్నాయి.