Jeremiah 49:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా చెపుతున్నాడు, “నా స్వయం శక్తితో నేనీ ప్రమాణం చేస్తున్నాను, బొస్రా నగరం నాశనమవుతుందని నిశ్చయంగా చెపుతున్నాను. ఆ నగరం పాడుబడి రాళ్లగుట్టలా మారిపోతుంది. ఇతర నగరాలకు ప్రజలు కీడు జరగాలని కోరుకున్నప్పుడు ఈ నగరానికి సంభవించినట్లు జరగాలని దీనిని ఉదహరిస్తారు. ప్రజలా నగరాన్ని అవమానపరుస్తారు. బొస్రా చుట్టుపట్లవున్న పట్టణాలన్నీ శాశ్వతంగా శిథిలాలైపోతాయి.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణములన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా, “నా జీవం తోడు, బొస్రా నాశనంగా, శాపంగా మారుతుందని, భయానకంగా, నిందలకు గురి అవుతుందని నా మీద నేను ప్రమాణం చేస్తున్నాను. దాని పట్టణాలన్ని శాశ్వతంగా శిథిలావస్థలో ఉంటాయి” అని ప్రకటిస్తున్నారు.