Jeremiah 49:23 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దమస్కును గూర్చిన వాక్కు. హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడు చున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదుదానికి నెమ్మదిలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఈ వర్తమానము దమస్కు నగరాన్ని గురించినది: “హమాతు, అర్పాదు పట్టణాలు భయపడ్డాయి. దుర్వార్త వినటంవల్ల అవి భయపడ్డాయి. వారు అధైర్యపడ్డారు. వారు వ్యాకులపడి బెదిరారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దమస్కునుగూర్చిన వాక్కు. –హమాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గు పడుచున్నవి అవి పరవశములాయెను సముద్రముమీద విచారము కలదు దానికి నెమ్మదిలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దమస్కు గురించి: “హమాతు, అర్పదు చెడువార్త విని భయంతో క్రుంగిపోయారు. వారు హృదయంలో కలవరపడ్డారు, నెమ్మది లేని సముద్రంలా ఆందోళన పడుతున్నారు.