Jeremiah 49:31 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నిశ్చంతగావున్న దేశం ఒకటున్నది. దాన్ని ఎవ్వరూ ఓడించరని ఆ రాజ్యానికి ధీమా. ఆ దేశ రక్షణకు ద్వారాలుగాని, చుట్టూ కంచెగాని ఏమీ లేవు. వారు ఒంటరిగా నివసిస్తారు. ‘ఆ రాజ్యాన్ని ఎదుర్కోండి!’ అని యెహోవా అంటున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు జనముమీద పడుడి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మీరు లేచి, నిర్భయంగా జీవిస్తూ, ద్వారాలు గాని అడ్డు గడియలు గాని లేకుండ ప్రజలు క్షేమంగా ఉంటున్న, దేశం మీద దాడి చేయండి,” అని యెహోవా ప్రకటిస్తున్నారు.