Jeremiah 5:14 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు తెలియజేసాడు: “నేను వారిని శిక్షించనని ఆ ప్రజలు అన్నారు. కావున యిర్మీయా, నేను నీకు చెప్పిన మాటలు అగ్నిలా ఉంటాయి. ఆ ప్రజలు కొయ్యలాంటివారు. అగ్ని ఆ కట్టెనంతా దహించివేస్తుంది.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున సైన్యములకధిపతియు దేవుడునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు —వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసెదను; ఇదే యెహోవా వాక్కు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కాబట్టి సైన్యాల యెహోవా దేవుడు ఇలా అంటున్నారు: “ప్రజలు ఈ మాటలు మాట్లాడారు కాబట్టి, నేను నీ నోటిలో నా మాటలను అగ్నిగాను ఈ ప్రజలను అది కాల్చివేసే కలపగాను చేస్తాను.