Jeremiah 50:44 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదనునన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి?నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యెహోవా చెపుతున్నాడు, “అప్పుడప్పుడు యొర్దాను నదీ తీరాన దట్టమైన పొదల నుండి ఒక సింహం వస్తుంది. ప్రజలు పొలాల్లో మందవేసిన పశువులపైకి ఆ సింహం వచ్చిపడుతుంది. అప్పుడా పశువులు చెల్లాచెదరైపోతాయి. నేనా సింహంలా వుంటాను. బబులోనును దాని రాజ్యం నుంచి తరిమికొడతాను! ఇది చేయటానికి నేనెవరిని ఎన్నుకుంటాను? నాలాగా మరే వ్యక్తి లేడు. నన్నెదిరించగలవాడు మరొక్కడూ లేడు. కావున నేనే ఆ పని చేస్తాను. నన్ను బయటకు తోలటానికి ఏ గొర్రెల కాపరీ రాడు. నేను బబులోను ప్రజలను తరిమిగొడతాను.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చిరకాల నివాసమును పట్టుకొనవలెనని శత్రువులు యొర్దాను ప్రవాహములోనుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దానియొద్దనుండి తోలి వేయుదును నేనెవని ఏర్పరతునో వానిని దానిమీద నియమించెదను నన్ను పోలియున్నవాడై నన్ను ఆక్షేపణచేయువాడేడి? నన్ను ఎదిరింపగల కాపరి ఏడి?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యొర్దాను పొదల్లో నుండి సింహం సమృద్ధిగా ఉన్న పచ్చిక బయళ్లకు వస్తున్నట్లుగా, నేను బబులోనును దాని దేశం నుండి క్షణాల్లో తరిమివేస్తాను. దీని కోసం నేను నియమించిన వ్యక్తి ఎవరు? నాలాంటివారు ఎవరున్నారు, ఎవరు నన్ను సవాలు చేయగలరు? ఏ కాపరి నాకు వ్యతిరేకంగా నిలబడగలడు?”