Jeremiah 51:13 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు. నీవు ధనధాన్యాలతో తులతూగుతున్నావు. కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే కాలం అంతమవుతూవుంది. నీకు వినాశనకాలం దాపురించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
విస్తారజలములయొద్ద నివసించుదానా, నిధుల సమృద్ధిగలదానా, నీ అంతము వచ్చినది అన్యాయలాభము నీకిక దొరకదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అనేక జలాల ప్రక్కన నివసించేదానా, సమృద్ధి సంపదలు కలిగి ఉన్నదానా, నీ అంతం వచ్చింది, నీవు నాశనమయ్యే సమయం వచ్చింది.