Jeremiah 51:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తెలివిలేక ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని ప్రజలు బహుమూర్ఖులు. దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు. నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు. ఆ విగ్రహాలన్నీ బూటకపు దేవతలే. కావున ఆ పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి. ఆ విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తెలివిలేక ప్రతిమనుష్యుడు పశుప్రాయుడు పోతపోయు ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమొందును అతడు పోతపోసినది మాయారూపము దానిలో ప్రాణమేమియు లేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“మనుష్యులందరు బుద్ధి జ్ఞానం లేనివారు; ప్రతి కంసాలివాడు తన విగ్రహాలను చూసి సిగ్గుపడతాడు. అతడు చేసే చిత్రాలు మోసం; వాటిలో ఊపిరి లేదు.