Jeremiah 51:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురు వారు తమ కోటలలో నిలుచుచున్నారు వారి పరాక్రమము బలహీనత ఆయెను వారును స్త్రీలవంటివారైరి
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బబులోను సైనికులు పోరాడటం మానివేశారు. వారు తమ కోటల్లోనే ఉండిపోయారు. వారి శక్తి తరిగిపోయింది. వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు. బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి. దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[30-32] బబులోను పరాక్రమవంతులు యుద్ధముచేయక మాను దురువారు తమ కోటలలో నిలుచుచున్నారువారి పరాక్రమము బలహీనత ఆయెనువారును స్త్రీలవంటివారైరివారి నివాసస్థలములు కాల్చబడుచున్నవి వారి అడ్డగడియలు విరిగిపోయెను అతని పట్టణమంతయు పట్టబడును కోనేటి దూలము లును జమ్మును అగ్నిచేత కాల్చబడును దాని యోధులు దిగులుపడిరి అని బంట్రౌతు వెంబడి బంట్రౌతును దూతవెంబడి దూతయు పరుగెత్తుచు బబులోను రాజు నకు తెలియజేతురు. దాని రేవులు శత్రువశమాయెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బబులోను యోధులు యుద్ధం ఆపివేశారు; వారు తమ కోటల్లోనే ఉంటారు. వారి బలం సమసిపోయింది; వారు బలహీనులయ్యారు. దాని నివాసాలకు నిప్పు పెట్టారు; దాని ద్వారబంధాలు విరిగిపోయాయి.