Jeremiah 51:35 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మమ్మల్ని బాధించటానికి బబులోను భయంకరమైన పనులు చేసింది. ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.” సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు: “బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు. వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.” యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నాకును నా దేహమునకును చేయబడిన హింస బబులోనుమీదికి ప్రతికారరూపముగా దిగును గాక యని సీయోను నివాసి యనుకొనును నా ఉసురు కల్దీయదేశ నివాసులకు తగులునుగాక అని యెరూషలేము అనుకొనును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మన శరీరానికి చేసిన హింస బబులోనుకు జరుగును గాక,” అని సీయోను నివాసులు అంటున్నారు. “మా రక్తదోషం బబులోనులో నివసించేవారి మీద ఉండును గాక,” అని యెరూషలేము అంటుంది.