Jeremiah 52:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అతడు పట్టణములోనుండి యోధులమీద నియ మింపబడిన యొక ఉద్యోగస్ధుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగు వానియొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
రాజుయొక్క ప్రత్యేక అంగరక్షక దళాధిపతి పోరాటయోధుల దళాధిపతిని కూడా పట్టుకున్నాడు. రాజుయొక్క సలహాదారులలో ఏడుగురిని కూడా అతడు పట్టుకున్నాడు. ఆ మనుష్యులు ఇంకా యెరూషలేములో ఉన్నారు. సైన్యంలో మనుష్యులను చేర్చుకొనే అధికారిని (లేఖరి) కూడ అతడు పట్టుకున్నాడు. నగరంలో ఉన్న అరువది మంది సామాన్య ప్రజలను కూడా అతడు పట్టుకున్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అతడు పట్టణములోనుండి యోధులమీద నియమింపబడిన యొక ఉద్యోగస్థుని, పట్టణములో దొరికిన రాజసన్నిధిలో నిలుచు ఏడుగురు మనుష్యులను, దేశ సైన్యాధిపతియగువానియొక్క లేఖరిని, పట్టణపుమధ్యను దొరికిన అరువదిమంది దేశప్రజలను పట్టుకొనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పట్టణంలో ఇంకా ఉన్నవారిలో నుండి అతడు సైనికుల అధికారిని, ఏడుగురు రాజ సలహాదారులను తీసుకెళ్లాడు. అంతేకాక, దేశప్రజలను సైన్యంలో చేర్చే ప్రధాన అధికారిగా ఉన్న కార్యదర్శిని, పట్టణంలో దొరికిన అరవైమంది ప్రముఖులను పట్టుకుని తీసుకెళ్లాడు.