Jeremiah 52:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజ దేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మను ష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నెబుకద్నెజరు పాలన ఇరువై మూడవ సంవత్సరంలో నెబూజరదాను ఏడువందల నలభై ఐదు మంది యూదా వారిని బందీ చేశాడు. నెబూజరదాను రాజు యొక్క ప్రత్యేక అంగరక్షక ధళాధిపతి. మొత్తం మీద నాలుగువేల ఆరువందల మందిని బందీలుగా పట్టుకుపోయారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నెబుకద్రెజరు ఏలుబడియందు ఇరువది మూడవ సంవత్సరమున రాజదేహసంరక్షకుల యధిపతియగు నెబూజరదాను యూదులలో ఏడువందల నలుబది యయిదుగురు మనుష్యులను చెరగొనిపోయెను; ఆ మనుష్యుల వెరసి నాలుగువేల ఆరువందలు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నెబుకద్నెజరు తన పరిపాలన ఇరవై మూడవ సంవత్సరంలో, 745 మంది యూదులను రాజ రక్షక దళాధిపతియైన నెబూజరదాను బందీలుగా తీసుకెళ్లాడు. బందీలుగా వెళ్లిన ప్రజలు మొత్తం 4,600 మంది.