Jeremiah 6:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను ¸°వనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్త లును వయస్సు మీరినవారును వృద్ధులును పట్టుకొనబడె దరు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది! దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను! అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను, గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు. భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కావున నేను యెహోవా క్రోధముతో నిండియున్నాను, దానిని అణచుకొని అణచుకొని నేను విసికియున్నాను, ఒకడు తప్పకుండ వీధిలోనున్న పసిపిల్లలమీదను యౌవనుల గుంపుమీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను, భార్యా భర్తలును వయస్సుమీరినవారును వృద్ధులును పట్టుకొనబడెదరు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కానీ నేను యెహోవా యొక్క ఉగ్రతతో నిండి ఉన్నాను, నేను దానిని పట్టుకోలేను. “వీధిలో ఉన్న పిల్లల మీద ఒక్కచోట పోగైన యువకుల మీద దానిని కుమ్మరించండి; భార్య భర్తలు, వృద్ధులు, వయస్సు మీరిన వారు అందులో చిక్కుకుంటారు.