Jeremiah 6:29 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టు చున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్క మునకు రారు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు. కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది. కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది! శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస. వృధా కాలయాపన. అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కొలిమితిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది; వ్యర్థము గానే చొక్కముచేయుచు వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సీసాన్ని నిప్పుతో కాల్చివేయడానికి కొలిమి తిత్తులు తీవ్రంగా ఊదుతున్నారు, కానీ శుద్ధి చేయడం వృధా అవుతుంది; దుష్టులు ప్రక్షాళన చేయబడరు.