Jeremiah 9:11 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయు చున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంట నక్కలకు స్థావరమవుతుంది. నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెరూషలేమును పాడు దిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను, యూదాపట్టణములను నివాసిలేని పాడు స్థలముగా చేయుచున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను యెరూషలేమును శిథిలాల కుప్పగా, నక్కల విహారంగా చేస్తాను. నేను యూదా పట్టణాలను నాశనం చేస్తాను, అక్కడ ఎవరూ నివసించలేరు.”