Jeremiah 9:14 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలు దేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తమ హృదయమూర్ఖతచొప్పున జరిగించుటకై తమపితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దానికి బదులు, వారు తమ హృదయాల మొండితనాన్ని అనుసరించారు; వారి పూర్వికులు వారికి బోధించినట్లుగా వారు బయలును అనుసరించారు.”