Job 2:10 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అందుకతడుమూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయ మందును యోబునోటి మాటతోనైనను పాపము చేయలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యోబు తన భార్యతో, “నీవు తెలివి తక్కువ స్త్రీలా మాట్లాడుతున్నావు! దేవుడు మనకు మంచి వాటిని ఇచ్చినప్పుడు, మనం వాటిని స్వీకరిస్తున్నాం. కనుక కష్టాల్ని కూడా మనం స్వీకరించాలి గాని ఆరోపణ చేయకూడదు” అని జవాబిచ్చాడు. ఇవన్ని జరిగినప్పటికీ కూడా యోబు పాపం చేయలేదు. దేవునికి విరుద్ధంగా ఏమియు మాట్లాడనూలేదు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అందుకతడు–మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు; మనము దేవునివలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటిమాటతోనైనను పాపము చేయలేదు.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అందుకతడు, “నీవు ఒక మూర్ఖురాలిగా మాట్లాడుతున్నావు. దేవుని దగ్గర నుండి మేలును మాత్రమే అంగీకరించాలా, కీడును అంగీకరించకూడదా?” అని సమాధానం ఇచ్చాడు. ఈ సంగతుల్లో ఏ విషయంలోను మాటల ద్వారా యోబు పాపం చేయలేదు.