Job 37:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్య మైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెర వేర్చును
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
భూమి మీద అంతటికీ చెదరిపోయేలా దేవుడు మేఘాలను ఆజ్ఞాపిస్తాడు. దేవుడు ఏమి చెబితే అది మేఘాలు చేస్తాయి.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[12-13] ఆయనవలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములును సంచారము చేయును ఆయన వాటికి ఆజ్ఞాపించునది యావత్తును అవి నెరవేర్చును శిక్షకొరకే గాని తన భూలోకముకొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించినదానిని అవి నెరవేర్చును.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
భూమి అంతటి ఉపరితలం మీద ఆయన ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి, ఆయన నిర్దేశించిన మార్గంలో అవి చుట్టూ తిరుగుతాయి.