Job 39:25 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఘోషను వినును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
బూర మ్రోగినప్పుడు గుర్రం ‘ఓహో’ అంటుంది. దూరం నుంచే అది యుద్ధాన్ని పసికడుతుంది. సేనాని కేకలు వేసే ఆజ్ఞలను, ఇతర యుద్ధ ధ్వనులను అది వింటుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బాకానాదము వినబడినప్పుడెల్ల అది అహా అహా అనుకొని దూరమునుండి యుద్ధవాసన తెలిసి కొనును సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధఫెూషను వినును. డేగ నీ జ్ఞానముచేతనే ఎగురునా?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బూర మ్రోగగానే అది, ‘ఆహా!’ అని అంటుంది దూరం నుండే యుద్ధవాసన, సేనాధిపతుల కేకలు యుద్ధఘోష పసిగడుతుంది.