Joel 1:12 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ద్రాక్షావల్లులు ఎండిపోయాయి. అంజూరపుచెట్టు చస్తోంది. దానిమ్మ చెట్టు, ఖర్జూరపుచెట్టు, జల్దరు చెట్టు, పొలములోని చెట్లు అన్నీ ఎండిపోయాయి. ప్రజల్లో సంతోషం చచ్చింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ద్రాక్షతోట కాపరులారా, రోదనము చేయుడి. ద్రాక్షచెట్లు చెడిపోయెను అంజూరపుచెట్లు వాడి పోయెను దానిమ్మచెట్లును ఈతచెట్లును జల్దరుచెట్లును తోట చెట్లన్నియు వాడిపోయినవి
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ద్రాక్ష ఎండిపోయింది అంజూర చెట్టు వాడిపోయింది; దానిమ్మ, తాటి చెట్టు, ఆపిల్ పండు చెట్లు, పొలం లోని చెట్లన్నీ ఎండిపోయాయి. ఖచ్చితంగా మనుష్యులకు ఆనందం లేకుండా పోయింది.