Joel 2:20 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లువాసన కొట్టును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
లేదు. ఆ ఉత్తరపు ప్రజలను మీ దేశంనుండి వెళ్ళగొడతాను. ఎండిపోయిన ఖాళీ దేశానికి వారు వెళ్ళేటట్టు నేను చేస్తాను. వారిలో కొందరు తూర్పు సముద్రానికి వెళ్తారు. మరి కొందరు పడమటి సముద్రానికి వెళ్తారు. ఆ ప్రజలు అంత భయంకరమైన పనులు చేశారు. కాని వారు చచ్చి కుళ్ళిపోతున్న దానిలా ఉంటారు. అక్కడ భయంకరమైన కంపు కొడుతుంది!”
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఉత్తరదిక్కునుండి వచ్చువాటిని మీకు దూరముగా పార దోలి, యెండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును; అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని, వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును; అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుళ్లు వాసన కొట్టును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను ఉత్తర దిక్కునుండి వచ్చే సైన్యాన్ని మీకు దూరంగా తరిమివేస్తాను. ఎండిపోయిన, నిస్సారమైన ప్రాంతానికి దానిని పంపివేస్తాను; తూర్పు వైపున్న దాని సైన్యం మృత సముద్రంలో మునిగిపోతుంది, పశ్చిమ వైపున్న దాని సైన్యం మధ్యధరా సముద్రంలో మునిగిపోతుంది. అది కంపు కొడుతుంది, దాని దుర్వాసన లేస్తుంది.” నిజంగా ఆయన గొప్పకార్యాలు చేశారు!