Joel 2:25 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్య ములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగు లును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను. ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు మరియు ఆ కోత మిడుతలు మీ పంటను తినివేశాయి. కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మీరు కడుపార తిని తృప్తిపొంది మీకొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులును పసరు పురుగులును చీడపురుగులును అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరల నిత్తును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“నేను మీ మధ్యకు పంపిన నా గొప్ప సైన్యం పెద్ద మిడతలు, చిన్న మిడతలు, ఇతర మిడతలు, మిడతల గుంపులు తినేసిన సంవత్సరాల పంటను నేను తిరిగి మీకు ఇస్తాను.