Joel 3:18 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదు లన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిర ములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
“ఆ రోజున పర్వతాలనుండి తియ్యటి ద్రాక్షారసం కారుతుంది. కొండల్లో పాలు, తేనెలు ప్రవహిస్తాయి. మరియు యూదాలోని ఖాళీ నదులన్నిటిలో నీళ్ళు ప్రవహిస్తాయి. యెహోవా ఆలయంలోనుండి ఒక నీటి ఊట చిమ్ముతుంది. అది షిత్తీము లోయకు నీళ్ళు ఇస్తుంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఆ దినమందు పర్వతములలోనుండి క్రొత్త ద్రాక్షారసము పారును, కొండలలోనుండి పాలు ప్రవహించును. యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములోనుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“ఆ రోజు పర్వతాల నుండి క్రొత్త ద్రాక్షరసం ప్రవహిస్తుంది, కొండల నుండి పాలు ప్రవహిస్తాయి; యూదాలోని వాగులన్నిటిలో నీళ్లు పారతాయి. యెహోవా మందిరంలో నుండి ఒక ఊట ప్రవహిస్తూ, షిత్తీము లోయను తడుపుతుంది.