Jonah 4:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పిం చెను. యోనాతలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మ సిల్లిబ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
మిట్టమధ్యాహ్నమయ్యే సరికి, దేవుడు తూర్పునుండి వేడిగాడ్పులు వీచేలా చేశాడు. యోనా తలమీద సూర్యుని వేడిమి ఎక్కువయ్యింది. యోనా బాగా నీరసించిపోయాడు. యోనా దేవునితో తనను చనిపోనిమ్మన్నాడు. “నేను బ్రతకటంకంటే చనిపోవటం మేలు” అని యోనా అన్నాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు ఎండ కాయగా దేవుడు వేడిమిగల తూర్పుగాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి–బ్రదుకుటకంటె చచ్చుట నాకు మేలనుకొనెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సూర్యుడు ఉదయించినప్పుడు, దేవుడు తూర్పు నుండి వడగాలిని పంపించారు, యోనా తలకు ఎండదెబ్బ తగిలి అతడు నీరసించిపోయాడు. “నేను బ్రతికి ఉండడం కంటే చావడం మేలు” అని తనలో తాను అనుకున్నాడు.