Joshua 10:11 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‌ హోరోనుకు దిగిపోవుత్రోవను పారి పోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మందియయిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హోరోను నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు వారు ఇశ్రాయేలీయుల యెదుటనుండి బేత్‍హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవుచుండగా, వారు అజేకాకు వచ్చువరకు యెహోవా ఆకాశమునుండి గొప్ప వడగండ్లను వారిమీద పడవేసెను గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారికంటె ఆ వడగండ్లచేత చచ్చినవారు ఎక్కువ మంది యయిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు బేత్-హోరోను నుండి అజేకాకు వెళ్లే దారిలో ఇశ్రాయేలీయుల నుండి పారిపోతుండగా, యెహోవా వారిపై పెద్ద వడగళ్ళు కురిపించారు, ఇశ్రాయేలీయుల ఖడ్గాల చేత చంపబడినవారి కంటే వడగళ్ళతో చచ్చినవారే ఎక్కువ.