Joshua 10:30 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజు నకును చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా దానిని దాని రాజును ఇశ్రాయేలీయులకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాతను హతము చేసిరి. అతడు యెరికో రాజునకు చేసినట్లు దాని రాజునకును చేసెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా ఆ పట్టణాన్ని దాని రాజును ఇశ్రాయేలు చేతికి అప్పగించారు. యెహోషువ ఆ పట్టణాన్ని, దానిలోని వారందరినీ కత్తితో చంపాడు. అక్కడ అతడు ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు. అతడు యెరికో రాజుకు చేసినట్లు దాని రాజుకు చేశాడు.