Joshua 10:32 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవ దినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోవా లాకీషును ఇశ్రాయేలీయులచేతికి అప్పగించెను. వారు రెండవదినమున దానిని పట్టుకొని తాము లిబ్నాకు చేసి నట్లే దానిని దానిలోనున్న వారినందరిని కత్తివాత హతము చేసిరి.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెహోవా లాకీషును ఇశ్రాయేలీయుల చేతికి అప్పగించారు. రెండవ రోజు యెహోషువ దానిని పట్టుకుని లిబ్నాకు చేసినట్లే ఆ పట్టణాన్ని, అందులోని వారందరినీ ఖడ్గంతో చంపాడు.