Joshua 10:39 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
దానిని దాని రాజును దాని సమస్త పుర ములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దానిని దాని రాజును దాని సమస్త పురములను పట్టుకొని కత్తివాతను హతముచేసి దానిలోనున్న వారినందరిని నిర్మూలముచేసిరి. అతడు హెబ్రోనుకు చేసినట్లు, లిబ్నాకును దాని రాజునకును చేసినట్లు, అతడు దెబీరుకును దాని రాజునకును చేసెను.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దాని గ్రామాలను పట్టుకుని కత్తితో చంపారు. అందులో ఉన్నవారందరిని పూర్తిగా నాశనం చేశారు. వారు ఎవ్వరినీ విడిచిపెట్టలేదు. లిబ్నాకు, దాని రాజుకు, హెబ్రోనుకు చేసినట్లే వారు దెబీరుకు, దాని రాజుకు చేశారు.