Joshua 17:18 — Compare Translations

3 translations compared side by side

Telugu (BSI) 1880
మీకు అధికబలముగలదు, మీకు ఒక్కవంతు చీటియేకాదు; ఆ కొండ మీదే, అది అర ణ్యము గనుక మీరు దానిని నరకుడి, అప్పుడు ఆ ప్రదే శము మీదగును; కనానీయులకు ఇనుపరథములుండినను వారు బలవంతులైయుండినను మీరు వారి దేశమును స్వాధీన పరచుకొనగలరనెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కొండ ప్రదేశం మీదే. అది అడవి అయినా మీరు చెట్లు నరికి మంచి నివాస ప్రదేశంగా దాన్ని మార్చుకోవచ్చు. అది మొత్తం మీ స్వంతం అవుతుంది. కనానీ ప్రజలను మీరు ఆ దేశం నుండి వెళ్లగొట్టివేయాలి. వారికి బలమూ, బలమైన ఆయుధాలూ ఉన్నప్పటికీ మీరు వారిని ఓడించేస్తారు.”
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అడవులతో ఉన్న ఆ కొండ మీదే. కాబట్టి దానిని నరకండి; అప్పుడు ఆ ప్రదేశం మీది అవుతుంది. కనానీయులకు ఇనుప రథాలు ఉన్నా వారు బలవంతులైనా మీరు వారిని వెళ్లగొట్టగలరు” అన్నాడు.