Joshua 19:17 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
[17-23] నాలుగవ వంతు చీటి వారి వంశములచొప్పున ఇశ్శా ఖారీయుల పక్షముగా వచ్చెను. వారి సరిహద్దు యెజ్రెయేలు కెసుల్లోతు షూనేము హపరాయిము షీయోను అనహరాతు రబ్బీతు కిష్యోను అబెసు రెమెతు ఏన్గన్నీము ఏన్‌హద్దా బేత్పస్సెసు అను స్థలములవరకు సాగి తాబోరు షహచీమా బేత్షెమెషు అను స్థలములను దాటి యొర్దానువరకు వ్యాపించెను. వాటి పల్లెలు గాక పదుమూడు పట్టణములు వారి కాయెను. అవి వాటి పల్లెలతోకూడ వారి వంశముల చొప్పున ఇశ్శాఖారీయుల గోత్రమునకు కలిగిన స్వాస్థ్యము.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నాల్గవ చీటి వారి వంశాల ప్రకారం ఇశ్శాఖారుకు వచ్చింది.