Joshua 20:5 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
హత్యవిషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ సరహంతుకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకు మునుపు వానియందు పగపట్టలేదు.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
హత్యవిషయములో ప్రతిహత్య చేయువాడు వానిని తరిమినయెడల వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు; ఏలయనగా అతడు పొరబాటున తన పొరుగువాని చంపెనుగాని అంతకుమునుపు వానియందు పగపట్టలేదు.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
హత్యకు ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి వెంబడిస్తూ వస్తే ఆ పెద్దలు వానికి పారిపోయి వచ్చిన వ్యక్తిని అప్పగించకూడదు. ఎందుకంటే పారిపోయిన వ్యక్తి తన పొరుగువారిని అనుకోకుండ చంపాడు కాని పగతో కాదు.