Joshua 20:8 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
యొర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తూర్పుదిక్కున యొర్దాను అద్దరిని యెరికోనొద్ద రూబేనీయుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్యములో ని బేసెరును, గాదీయుల గోత్రములోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యొర్దానుకు తూర్పున (యెరికో నుండి అవతలి వైపు) వారు రూబేను గోత్రంలో పీఠభూమిలోని అరణ్యంలో బేసెరును, గాదు గోత్రంలో గిలాదులోని రామోతును, మనష్షే గోత్రంలో బాషానులోని గోలానును నిర్ణయించారు.