Joshua 8:1 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యెహోవా యెహోషువతో చెప్పాడు: “భయపడకు. జడియకు. నీ యుద్ధ వీరులందరినీ హాయి మీదికి నడిపించు. హాయి రాజును ఓడించేందుకు నేను నీకు సహాయం చేస్తాను. అతని ప్రజల్ని, అతని పట్టణాన్ని, అతని దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను–భయపడకుము, జడియకుము, యుద్ధసన్నద్ధులైన వారినందరిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించుచున్నాను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు యెహోవా యెహోషువతో, “భయపడకు; నిరుత్సాహపడకు. సైన్యమంతటిని నీతో తీసుకుని హాయి మీద దండెత్తు. నేను హాయి రాజును, అతని జనులను, పట్టణాన్ని, అతని దేశాన్ని నీ చేతులకు అప్పగించాను.