Joshua 8:29 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హాయి రాజును యెహోషువ ఒక చెట్టుకు ఉరితీసాడు. ఆ సాయంత్రం వరకు అతణ్ణి అలానే ఆ చెట్టుకు వేలాడనిచ్చాడు. సూర్యాస్తమయం అయినప్పుడు ఆ రాజు దేహాన్ని చెట్టు మీదనుండి దించమని యెహోషువ తన మనుష్యులకు ఆజ్ఞాపించాడు. పట్టణద్వారం దగ్గర వారు అతని దేహాన్ని క్రింద పడవేసారు. తర్వాతవారు అతని దేహాన్ని రాళ్ల గుట్టతో కప్పివేసారు. ఆ రాళ్ల కుప్ప నేటికీ అక్కడ ఉంది.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడదీసెను. ప్రొద్దు గ్రుంకుచున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అతడు హాయి రాజును సాయంకాలం వరకు స్తంభానికి వ్రేలాడదీశాడు. సూర్యాస్తమయ సమయంలో యెహోషువ ఆ మృతదేహాన్ని స్తంభం నుండి క్రిందికి దించి పట్టణ ద్వారం దగ్గర పడవేయమని ఆజ్ఞాపించాడు. వారు అలాగే చేసి దానిపై ఒక పెద్ద రాళ్లకుప్పను వేశారు. అది ఇప్పటికీ అలాగే ఉంది.