Judges 1:17 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతో కూడ పోయి జెఫ తులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యూదావంశస్థులు తమ సహోదరులైన షిమ్యోనీయులతోకూడ పోయి జెఫతులో నివసించిన కనానీయులను హతము చేసి పట్టణమును నిర్మూలముచేసి ఆ పట్టణమునకు హోర్మా అను పేరు పెట్టిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తర్వాత యూదా వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోనీయులతో వెళ్లి జెఫతులో నివసిస్తున్న కనానీయులపై దాడి చేసి, పట్టణాన్ని పూర్తిగా నాశనం చేశారు. కాబట్టి ఆ పట్టణానికి హోర్మా అని పేరు పెట్టారు.