Judges 11:13 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
అమ్మోనీయుల రాజుఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమా ధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించు మని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని ఆక్రమించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము యుద్ధం చేస్తున్నాము. అమ్మోను నది నుండి యబ్బోకు నది వరకు, యోర్దాను నది వరకు వారు మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రాయేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో చెప్పాడు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అమ్మోనీయుల రాజు–ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి వచ్చినప్పుడు వారు అర్నోను మొదలుకొని యబ్బోకు వరకును యొర్దానువరకును నా దేశము ఆక్రమించుకొని నందుననే నేను వచ్చియున్నాను. కాబట్టి మనము సమాధానముగా నుండునట్లు ఆ దేశములను మరల మాకప్పగించుమని యెఫ్తా పంపిన దూతలతో సమాచారము చెప్పెను.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అమ్మోనీయుల రాజు యెఫ్తా దూతలతో, “ఇశ్రాయేలు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, వారు అర్నోను నుండి యబ్బోకు వరకు, యొర్దాను వరకు ఉన్న నా దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇప్పుడు నాకు సమాధానంతో దానిని తిరిగి ఇచ్చేయాలి” అన్నాడు.