Judges 11:26 — Compare Translations

4 translations compared side by side

Telugu (BSI) 1880
ఇశ్రాయేలీయులు హెప్బోను లోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరుల లోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు పట్టణంలోను, దాని చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు?
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఇశ్రాయేలీయులు హెష్బోనులోను దాని ఊరులలోను అరోయేరులోను దాని ఊరులలోను అర్నోను తీరముల పట్టణములన్నిటిలోను మూడు వందల సంవత్సరములనుండి నివసించుచుండగా ఆ కాలమున నీవేల వాటిని పట్టుకొనలేదు?
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు హెష్బోను, అరోయేరు, చుట్టుప్రక్కల స్థావరాలను, అర్నోనులో ఉన్న అన్ని పట్టణాలను ఆక్రమించింది. ఆ సమయంలో మీరు వాటిని ఎందుకు తిరిగి తీసుకోలేదు?