Judges 12:4 — Compare Translations
4 translations compared side by side
Telugu (BSI) 1880
అప్పుడు యెఫ్తా గిలాదువారి నందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారుఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.
Telugu 1997 TERV (పవిత్ర బైబిల్)
అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.
Telugu Bible (TELOV) (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు యెఫ్తా గిలాదువారినందరిని పోగుచేసికొని ఎఫ్రాయిమీయులతో యుద్ధముచేయగా గిలాదువారు ఎఫ్రాయిమీయులను జయించిరి. ఏలయనగా వారు–ఎఫ్రాయిమీయులకును మనష్షీ యులకునుమధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమీ యులయెదుట నిలువక పారిపోయిన వారనిరి.౹
Telugu TCV (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
యెఫ్తా గిలాదు మనుష్యులను కూర్చుకుని ఎఫ్రాయిం వారితో యుద్ధం చేశాడు. ఎఫ్రాయిమీయులను, “గిలాదీయులైన మీరు ఎఫ్రాయిం మనష్షేల ఎదుట నిలబడలేక పారిపోయారు” అని అన్నారు.